అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో చెలరేగిన భారీ కార్చిచ్చు (వైల్డ్ ఫైర్) తీవ్ర కలకలం రేపింది. స్పోకన్ నగర పరిసరాల్లో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 700 ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం తీవ్రత దృష్ట్యా దాదాపు 60 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. పొడి గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరించాయని వెల్లడించారు. కార్చిచ్చుకు కారణమై ఉండొచ్చనే అనుమానంతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు..
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం తీవ్ర కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వాషింగ్టన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటివరకు 2.5 లక్షల ఎకరాలకు పైగా భూమిని దహనం చేశాయి. పరిస్థితి విషమించడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు (Washington wildfires 2026).