Weather Update: తెలుగు రాష్ట్రాలపై భానుడి …
ఏప్రిల్ నెలలోనే నిప్పులు చెరిగే ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యథికంగా వరంగల్ జిల్లాలో 44 డిగ్రీలు నిర్మల్ జిల్లా తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 43.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ ఉష్ణగ్రోతలు మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని జిల్లాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2 -3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది…