ఇషాన్ కిషన్ విజిల్ పోడు సెలబ్రేషన్స్..

చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. 15వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజూ శామ్సన్ మెరుపు వేగంతో క్లాసెన్‌ను స్టంప్ అవుట్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది హైదరాబాద్. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్… సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను దారుణంగా ట్రోలింగ్ చేశాడు. విజిల్ వేస్తూ (Whistle Podu)… ఇక స్టేడియాన్ని ఖాళీ చేయండి అంటూ సైగలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) లాంటి దిగ్గజాలు స్టేడియంలో ఉన్నప్పుడే, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను వెళ్లిపోండి అంటూ హెచ్చరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఇషాన్ కిషన్ పై (Ishan Kishan) చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. బంతితో కెప్టెన్‌ కమిన్స్‌ (3/28), బ్యాటుతో ఇషాన్‌ కిషన్‌ (47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది. 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం చేసుకున్న ఆరెంజ్‌ ఆర్మీ..తనతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ బెర్తు కూడా ఖాయం చేసింది. ఏడో ఓటమితో చెన్నై దాదాపు ఎలిమినేట్‌ అయింది…

ఈ మ్యాచ్‌లో మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 19వ ఓవర్ వరకూ ఆడుతూనే ఉన్నాడు. ఇక విజయానికి ఆరు పరుగుల దూరంలో ఉన్నప్పుడు సిక్సర్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర దొరికిపోయాడు. 47 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. చెపాక్ పిచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒత్తిడిలో ఉన్న సమయంలోనూ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ని గెలిపించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ చెపాక్ స్టేడియంలో భారీగానే పేలాడు. స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ చేతులెత్తేస్తోంది అన్నవాళ్లకి గట్టిగానే ఇచ్చిపడేశాడు. పిచ్ ఎలా ఉన్నా తమ జట్టు ఆడుతుందని ఇషాన్ కిషన్ మరోసారి నిరూపించాడు. చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విన్నింగ్ నాక్ ఆడిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ అనంతరం విజిల్ పోడు సెలబ్రేషన్స్‌తో విజయాన్ని ఎంజాయ్ చేశాడు…

స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 180/ 7 ( బ్రెవిస్‌ 44, కార్తీక్‌ శర్మ 32, కమిన్స్‌ 3/28, సాకిబ్‌ హుస్సేన్‌ (2/34);
సన్‌రైజర్స్‌ : 19 ఓవర్లలో 181/5 (ఇషాన్‌ 70, క్లాసెన్‌ 47, ముకేశ్‌ 2/36)