ఎక్స్ పీరియం పార్క్ ఏకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి..
ఎక్స్ పీరియం పార్క్ ఏకో ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్, ఎక్స్ పీరియం వ్యవస్థాపకులు, చైర్మన్ రామడుగు రాందేవ్ రావు, పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ పీరియం పార్క్ హైదరాబాద్కు తలమణికం: మంత్రి జూపల్లి కృష్ణారావు..
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ…
దేశానికే కాదు ప్రపంచానికే తలమానికగా నిలిచేలా ఎక్స్పెరియం ఎకో పార్క్ ను తీర్చిదిద్దారని అన్నారు. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేవి చారిత్రక కట్టడాలు, ఐకానిక్ భవనాలు, జలాశయాలు, ఉద్యనవనాలలే కాదు, ఇప్పుడు ఎక్స్పెరియం ఎకో పార్క్ కూడా వాటి సరసన చేరుతుందని తెలిపారు. దేశ విదేశాలలో సైతం లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్పెరియంను తీర్చిదిద్దారని, హైదరాబాద్ సిగలో మరో మణిహారంగా మారుతున్నదని చెప్పారు. ఇది హైదరాబాద్లో ఒక వినూత్నమైన ఇకో-రెక్రియేషనల్ డెస్టినేషన్ గా నిలవనుందని పేర్కొన్నారు.