మీ సేవా కోసం దరఖాస్తు చేసుకోవాలి..

*🔹మీ సేవా కోసం దరఖాస్తు చేసుకోవాలి.*
*యాదాద్రి కలెక్టర్*
*హనుమంతరావు*

నారాయణపూర్, చౌటుప్పల్ (మం) పలు గ్రామాల్లో నూతన మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

అసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జైకేసారం, కొయ్యలగూడెం, చిన్నకొండూర్, తంగడపల్లి, నారాయణపూర్ (మం) మల్లారెడ్డిగూడెం, గుజ్జ గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ నెల 19లోగా కలెక్టరేట్లో సంబంధిత ధ్రువపత్రాలను అందజేయాలన్నారు..