మా ఇంటి ముంగట ఉన్న ఈ పోలీసు వ్యాన్ ఎందుకు..తెలంగాణ సర్పంచుల సంఘ అధ్యక్షులు యాదయ్య గౌడ్..

తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ఈరోజు రాత్రి నుంచి మా ఇంటి ముంగట ఉన్న ఈ పోలీసు వ్యాన్ ఎందుకు అంటే మీరు అసెంబ్లీకి వెళ్తారు ఏమో పోలీసులు అని ఆలోచనతోని పై అధికారులు మీ ఇంటి ముంగట ఉండాలని చెప్పినా అంటున్నారు…
గౌరవ ముఖ్యమంత్రి మీరు నెల నెల వేతనాలు తీసుకోవడం బంద్ చేయాలి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్సీలు గానీ మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు గాని లోడ్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంగా మీరు చెప్తున్నారు అలాంటప్పుడు మీరు వేతనాలు ఎందుకు తీసుకోవాలి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి పంచాయతీరాజ్ సంబంధించి నిధులు విడుదల చేయాలి మీరు ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అంటున్నారు కాబట్టి మీ వేతనాలు తీసుకోవడం బంద్ చేయండి మాకు అభివృద్ధి పనులు చేసిన బిల్లును చెల్లించండి..