ప్రభాస్‌ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు… వైఎస్ షర్మిళ..

ప్రభాస్‌ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ (YS Jagan)కు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు..మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారని, ఇలా ప్రచారం జరిగిందని తెలిసి కూడా అప్పుడు గాడిదలు కాశారా అని జగన్పై షర్మిల నిప్పులు చెరిగారు. ఎంక్వైరీ ఎందుకు చేయలేదని, జగన్ ఈ దుష్ప్రచారాన్ని ఆయన పార్టీ నేతలతో చేయించారని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు..జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ చార్జి షీట్లో పెడతారని, చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. జగన్ మోదీకి దత్త పుత్రుడని షర్మిల విమర్శించారు. తన మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారని షర్మిల చెప్పారు..