కాంగ్రెస్ పార్టీకి షాక్‌.. బీఆర్ఎస్‌లో పలువురు నాయకుల చేరిక..!

బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతల చేరికలు…
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు, ఇతర నాయకులు బీఆర్ఎస్ లో చేరారు..తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

Joining BRS in the presence of KTR at Telangana Bhavan

కాంగ్రెస్ కు రక్షణ కవచంలా బీజేపీ పార్టీ ఉందని.. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అరవింద్, బండి సంజయ్.. ఈ నలుగురు, రేవంత్ రెడ్డికి రక్షణ కవచం అన్నారు కేటీఆర్. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు.. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి అంటూ చురకలు అంటించారు. వీళ్లు రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నరా..? లేక బీజేపీలో ఉన్నారా…? అని ఆగ్రహించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారా..? లేక బీజేపీలో ఉన్నారా…? అని కన్ఫ్యూజన్ ఉంది అంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్..

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు, ఇతర నాయకులు గులాబీ గూటికి చేరారు. వీరందరికి తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు…