శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి…!

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి….‌
అమెరికా సబ్‌మెరైన్ టోర్పెడోతో కొట్టి ముంచేసిన‌ అమెరికా..

శ్రీలంక సముద్ర జలాల్లో బుధవారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ కు చెందిన ‘ఐరిస్ డెనా’ (IRIS Dena) అనే యుద్ధనౌక (ఫ్రిగేట్) గాలే తీరానికి సమీపంలో మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో శ్రీలంక నావికాదళం వేగంగా స్పందిించి సుమారు 30 మంది సిబ్బందిని ప్రాణాలతో రక్షించింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరత్ పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించారు..

అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్ కీలక సైనిక సామర్థ్యాన్ని కోల్పోతోందని, తమ ఆపరేషన్ ‘Epic Fury’ కొనసాగుతుందని అమెరికా హెచ్చరించింది. మరోవైపు, దేశం యుద్ధ వాతావరణంలో ఉన్నందున త్వరలోనే కొత్త నాయకుడిని ప్రకటిస్తామని ఇరాన్ వర్గాలు తెలిపాయి.

. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి
అమెరికా రక్షణ శాఖ మంత్రి (సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్) పీట్ హెగ్‌సెత్ బుధవారం (మార్చి 4, 2026) ఒక కీలక ప్రకటన చేశారు. హిందూ మహాసముద్రంలో, శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ఇరాన్ యుద్ధనౌక IRIS Denaను అమెరికా సబ్‌మెరైన్ టోర్పెడోతో కొట్టి ముంచేసిందని ఆయన ధృవీకరించారు.

*దాడి వివరాలు:

అంతర్జాతీయ జలాల్లో తాము సురక్షితంగా ఉన్నామని భావించిన ఇరాన్ నౌకను, అమెరికా నేవీకి చెందిన ఫాస్ట్ అటాక్ సబ్‌మెరైన్ ఒకే ఒక Mark 48 టోర్పెడోతో కూల్చివేసింది.
*చారిత్రక ప్రాధాన్యత* :
రెండో ప్రపంచ యుద్ధం (1945) తర్వాత, ఒక శత్రు దేశపు యుద్ధనౌకను టోర్పెడోతో ముంచేయడం ఇదే మొదటిసారి అని హెగ్‌సెత్ పేర్కొన్నారు. దీనిని ఆయన “Quiet Death” (నిశ్శబ్ద మరణం) అని అభివర్ణించారు.
*నష్టం* :
ఈ నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉండగా, ఇప్పటివరకు 83 మృతదేహాలను వెలికితీశారు. శ్రీలంక నేవీ సుమారు 32 మందిని రక్షించి గాలే (Galle) ఆసుపత్రికి తరలించింది. మిగిలిన వారు గాలిలో కలిసిపోయినట్లు సమాచారం.
2. *ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై స్పష్టత*
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన వారసుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఖండన: ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది.
ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, ఒక తాత్కాలిక నాయకత్వ మండలి (Interim Leadership Council) పాలనను పర్యవేక్షిస్తోంది. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్, చీఫ్ జస్టిస్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడానికి ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ సమావేశమై చర్చలు జరుపుతోంది. మొజ్తాబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా ఎవరినీ ఇంకా ప్రకటించలేదు