హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20 సందర్భంగా టీమిండియాకు ఘోర ఓటమి ఎదురైంది. వెస్టిండీస్ చేతిలో ఏకంగా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా. వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఈ క్రమంలోనే టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇందులో గెలిచిన వెస్టిండీస్…2-2 తేడాతో సిరీస్ ను మళ్లీ సమం చేసింది…”టీమిండియా వర్సెస్ విండీస్ ( IND vs WI) మధ్య జరిగిన హైదరాబాద్ లోని ఉప్పల్ ( Rajiv Gandhi International Stadium, Hyderabad) మ్యాచ్ లో శ్రేయస్ అయ్యరే టాస్ గెలిచాడు. ఈ తరుణంలోనే విండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన షాయ్ హోప్ సేన, కేవలం 3 వికెట్లు నష్టపోయి ఏకంగా 247 పరుగులు సాధించింది. ఎప్పటిలాగే టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలం కావడంతో షాయ్ హోప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. 50 బంతుల్లోనే షాయ్ హోప్ 102 పరుగులు సాధించాడు. ఇందులో 9 సిక్సర్లతో పాటు 4 బౌండరీలు ఉన్నాయి..
ఆరంభం నుంచే విండీస్ దూకుడు
ఓపెనర్లు షాయ్ హోప్, జ్యువెల్ ఆండ్రూ తొలి నుంచే దూకుడుగా ఆడారు. బౌండరీలు, సిక్సర్లతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఆండ్రూను (21) అక్షర్ పటేల్ ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రోన్ హెట్మైయర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 12 బంతుల్లోనే 33 పరుగులు చేసి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అతడిని ప్రిన్స్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు.
హోప్ నిలకడ.. రూథర్‌ఫోర్డ్ మెరుపులు
మరోవైపు కెప్టెన్ షాయ్ హోప్ వికెట్ కాపాడుకుంటూనే వేగంగా పరుగులు సాధించాడు. 102 పరుగులు (నాటౌట్) చేసి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. రోవ్‌మన్ పావెల్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేసినా విండీస్ పరుగుల వేగం తగ్గలేదు. రూథర్‌ఫోర్డ్ (49 నాటౌట్) క్రీజులోకి వచ్చాక దూకుడు మరింత పెరిగింది. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జోడీ భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది..
ఆరంభం నుంచే విండీస్ దూకుడు
ఓపెనర్లు షాయ్ హోప్, జ్యువెల్ ఆండ్రూ తొలి నుంచే దూకుడుగా ఆడారు. బౌండరీలు, సిక్సర్లతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఆండ్రూను (21) అక్షర్ పటేల్ ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రోన్ హెట్మైయర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 12 బంతుల్లోనే 33 పరుగులు చేసి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అతడిని ప్రిన్స్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు.
సంజు సామ్సన్ మెరుపులు.. అయినా భారత్‌కు ఓటమి..
247 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. సంజు సామ్సన్ (Sanju Samson) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆశలు రేపాడు. 23 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు.
సంజుకు తోడుగా తిలక్ వర్మ (Tilak Varma) 43 పరుగులు, నితీష్ రెడ్డి (Nitish Reddy) 41 పరుగులు చేశారు. వీరి ఇన్నింగ్స్‌తో భారత్ లక్ష్యానికి చేరువయ్యే ప్రయత్నం చేసింది.
అయితే వెస్టిండీస్ బౌలర్లు కీలక సమయంలో భారత బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. ముఖ్యంగా కీమో పాల్ (Keemo Paul) అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.
చివరికి భారత్ 20 ఓవర్లు పూర్తయ్యేలోపే 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సిరీస్ 2-2.. చివరి మ్యాచ్ కీలకం
నాలుగో టీ20లో విజయంతో వెస్టిండీస్ సిరీస్‌ను సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉంది. దీంతో చివరి మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌లో గెలిచే జట్టే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది..