స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమే..భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్..
స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.