కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,212 ఉద్యోగాలను టెక్నికల్ ట్రేడ్స్మెన్, పయనీర్ విభాగాల్లో భర్తీ చేయనుంది. వీటిల్లో టెక్నికల్ ట్రేడ్స్మెన్ విభాగంలో 9,195 పోస్టులు పురుషులకు 9,103 పోస్టులు, మహిళలకు 92 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మే 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్లైన్ రాత పరీక్ష, పీఈటీ, పీఎస్టీ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.