తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల..

*🔹 తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.*

_• ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లు._

_మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగిన టెన్త్‌ పరీక్షలు..

_• హాజరైన 5 లక్షల మంది విద్యార్థులు.

సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చిన ఎస్‌ఎస్‌సీ బోర్డు..

పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ విధానం
ఫలితాలు www.bse.telangana.gov.in వెబ్సైట్లో చూడొచ్చు…

పదో తరగతి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత.

గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉత్తీర్ణత.

ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం ఉత్తీర్ణత.

ప్రైవేటు పాఠశాలల్లో గతేడాది కంటే 4 శాతం ఎక్కువ ఉత్తీర్ణత
గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ఉత్తీర్ణత
రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోండి….

పదో తరగతి ఫలితాల్లో టాప్‌లో 3లో నిలిచిన మూడు జిల్లాలు ఇవే..

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానం లో 99.29 % మహబూబాబాద్ జిల్లా, రెండో స్థానం సంగారెడ్డి జిల్లా 99.09, చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 73.97% నిలిచాయి.

మే 15 వరకు రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్
పదో తరగతి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.500/- చొప్పున చెల్లించి నేటి నుంచి 15 రోజుల్లోపు అంటే మే 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు