స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి నోటుపై వినతి.

స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి నోటుపై వినతి.

_• దేవుడిని భక్తులు రకరకాల కోరికలు కోరుకుంటారు. కానీ, *అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది.* గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై ‘స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్:దేవుడిని భక్తులు రకరకాల కోరికలు కోరుకుంటారు.కానీ, అనంతపురం జిల్లా ఆత్మకూరు( Atmakur ) మండలం పంప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది…హుండీని లెక్కిస్తున్న సమయంలో ఓ రూ.20 నోటుపై “స్వామీ… మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు” అని రాసి ఉండటం కనిపించింది. ఈ వినతిని చూసిన సిబ్బంది ఒకింత విస్మయానికి గురికాగా, అక్కడున్న భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, వివాహం, సంతానం వంటి కోరికలతో దేవుడిని వేడుకునే భక్తులు కనిపిస్తుంటారు. కానీ ఒకరి మరణాన్ని కోరుతూ హుండీలో మొరపెట్టుకోవడం అరుదైన ఘటనగా నిలిచింది…మరోవైపు, “రూ.20 నోటుతో అత్తపై ఫిర్యాదు పెట్టేసింది”, “ఇరవై రూపాయలకే అత్తను లేపేయమని కోరింది”, “ఇలాంటి కోరికను దేవుడు కూడా ఊహించి ఉండడు” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన హాస్యంగా కనిపించినా, కుటుంబాల్లో పెరుగుతున్న విభేదాలు, మానసిక ఒత్తిడులు ఎంతటి తీవ్ర స్థాయికి చేరుతున్నాయో చెప్పే ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు.