22A భూముల అంశంపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు..మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పై కౌంటర్ ఎటాక్…!?

22Aతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు-హరీష్‌రావు..

అసెంబ్లీలో పొంగులేటి అన్నీ అబద్ధాలే మాట్లాడారు
సభలో మేం లేకుండా చేసి అబద్ధాలు చెప్పారు..

మేం అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు..

22Aలో ఎన్ని ఎకరాలు పెట్టారో సమాధానంలేదు.

22Aలో తప్పుగా రైతుల భూములు చేర్చినట్టు..
సభలో పొంగులేటి ఒప్పుకున్నారు.

క్షమాపణలు చెప్పకుండా పొంగులేటి తప్పించుకున్నారు..

సీఎం ఇళ్లు కూడా 22Aలో ఉందన్నారు
మరి ఆయన ఇళ్లను ఎప్పుడు తీసేస్తారో చెప్పాలి..

మా మామ భూములు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాయి..

మా మామ భూములు కొన్నప్పుడు..

కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది-.

తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లుతున్నారు.

మా మామ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌-హరీష్‌రావు

22A భూముల అంశంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 22A జాబితాలో భూములు చేర్చడంతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ పార్టీ సభ్యులు సభలో లేని సమయంలో అనేక విషయాలు చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. తాము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని అన్నారు. 22Aలో ఎన్ని ఎకరాల భూములను చేర్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు..

రైతుల భూములను 22Aలో తప్పుగా చేర్చినట్టు సభలో పొంగులేటి అంగీకరించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే దీనిపై క్షమాపణలు చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శించారు. సీఎం ఇళ్లు కూడా 22Aలో ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో.. వాటిని ఎప్పుడు జాబితా నుంచి తొలగిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..

తన మామకు గజ్వేల్ నియోజకవర్గంలో భూములు ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఆ భూములు కొనుగోలు చేసిన సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉందని పేర్కొన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన మామ రిటైర్డ్ బ్యాంక్ అధికారి అని హరీశ్‌రావు స్పష్టం చేశారు..