50 సెకన్లలో ట్రైన్ టికెట్ బుకింగ్..
రైలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఏజెంట్లు రెంటల్ సాఫ్ట్ వేర్ తో తత్కాల్ టికెట్లను కొల్లగొడుతున్నారు. టెస్లా, గద్దర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్ వంటి సాఫ్ట్ వేర్ లు ఉపయోగించి నెలకు రూ.1200 నుండి రూ.3200 అద్దెకు తీసుకుని, కేవలం 50 సెకన్లలో టికెట్లు బుక్ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికులు లాగిన్ అయ్యేలోపే ఏజెంట్లు ఐపీ అడ్రస్ లు మారుస్తూ టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. IRCTC వీటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నా, డెవలపర్లు సాఫ్ట్వేర్ లును అప్ డేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.