ఆమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు అని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదాని వెనుక ఎవరు ఉన్న అరెస్ట్ చేయాల్సిందే అన్నారు . ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆదాని దగ్గర డబ్బులు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ..అదానీ ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరుగుతున్నారో చెప్పాలన్నారు. రూ.2 వేల కోట్ల కుంభకోణానికి అదానీ పాల్పడ్డారు.. అదానీని ప్రధాని మోడీ కాపాడుతున్నారు అన్నారు. అదానీని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు..? ,అదానీని ఎవరు కాపాడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు.. అదానీ ఏం చేశారో మేం దేశ ప్రజలకు చెప్పగలిగాం అన్నారు రాహుల్. వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు Here’s Video: https://x.com/TeluguScribe/status/1859516225220386987?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1859516225220386987%7Ctwgr%5E30f6e1b36a063769027b51780e3e0faa2116d7f7%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F