రాకేష్ జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అందులో తన కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు..ఇక ఇప్పుడు తనను హీరోగా సిల్వర్ స్క్రీన్పై చూసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతను నటించిన చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) శుక్రవారం (నవంబర్ 22)న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. ప్రముఖ సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ ఇందులో కథానాయికగా నటిస్తుండడం విశేషం. హీరోగా నటించడంతో పాటు రాకింగ్ రాకేష్ స్వయంగా ఈ ను నిర్మించాడు. ఇప్పటికే ఈ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కేసీఆర్ ప్రమోషన్లలో పాల్గొన్న హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘నా లో కేసీఆర్ నటించారు. అదే నా కి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని అనుకుంటున్నాను. ఆయనకి తెలీయకుండా ఆయన్ని పెట్టి తీసా.
అలా ఈ లో చాలా మ్యాజిక్కులు ఉంటాయి . ఈ శుక్రవారం వస్తున్న అన్ని లు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వాదించండి. ఆడియెన్స్ కు మా రీచ్ కావాలనే ఉద్దేశంతో టికెట్ రేట్స్ కూడా భారీగా తగ్గించాం. టికెట్ వందరూపాయిలే. సంధ్యా లాంటి థియేటర్స్ లో టికెట్ 80, 50 రూపాయలకే దొరుకుతుంది’ అని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చాడు..