ఏడు అడుగులు కండక్టర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్…సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఫోటో…!.

ఇటీవల తెలంగాణకు సంబంధించిన ఒక బస్ కండక్టర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బస్సు ఆరడుగుల హైట్ ఉంటే కండక్టర్ మాత్రం ఏడు అడుగులు ఉండటంతో ఆయన విధులు నిర్వహించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు..తాజాగా ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది.

చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్న అహ్మద్‌ అన్సారీ మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా 2021 వ సంవత్సరంలో మరణించారు. దీంతో కారుణ్య నియామకం కింద తన కొడుకు అమీన్ అహ్మద్ కు మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది.

అయితే ఈయన ఏడు అడుగులు ఉండటంతో బస్సులో టికెట్లు ఇవ్వటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక వైపుకు వంగి ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ విధులు నిర్వహించడంతో తీవ్రమైన మెడ నొప్పి వెన్నునొప్పి సమస్యలతో అమీన్ అహ్మద్ బాధపడుతున్నారు. అయితే అహ్మద్‌ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కండక్టర్ అమీన్ అహ్మద్ సమస్య సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు. త్వరలోనే సజ్జనార్ అహ్మద్‌ అన్సారీకి వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ చేస్తారని మంత్రి పొన్నం తెలిపారు. ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమీన్ అహ్మద్ సమస్య పూర్తిగా తొలగిపోయినట్లేనట్టు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..