లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

విశాఖపట్నం :

విశాఖపట్నం టీడీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పై కేసు నమోదు.

కొత్తూరు నరేంద్ర ను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టినందుకు కేసు.

అధికారంలో ఉన్నామని గర్వంతో పోలీసులను బయపెడుతున్న అనంత లక్ష్మి.

గాజువాక సీఐ పార్ధసారధిని బదిలీ చేయిస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేసిన అనంతలక్ష్మి.

కొత్తూరు నరేంద్ర ను కొట్టినందుకు సెక్షన్ 323 కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు.

బీజేపీనే సన్నబియ్యం ఇస్తే.. దేశం మొత్తం ఎందుకివ్వట్లేదు?: టీపీసీసీ చీఫ్

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తోందని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ ఖండించారు. రాష్టంలో సన్నబియ్యం బీజేపీనే ఇస్తే.. దేశం మొత్తం ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. బండి సంజయ్‌లో రోజురోజుకీ అభద్రతా భావం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు..

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం

గర్భవతిగా ఉన్న భార్య మీద దాడి సిమెంట్ ఇటుకతో దాడి చేసిన భర్త మహమ్మద్ బస్‌రత్

తీవ్రంగా గాయపడిన భార్య.. పరిస్థితి విషమం

2023లో భార్య షబానా పర్వీన్(22)ను ప్రేమ వివాహం చేసుకున్న మహమ్మద్ బస్‌రత్(32)

కుటుంబ కలహాలతో భార్యపై దాడి చేసిన బస్‌రత్..

*కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు*

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పన్నుల విధానం పెద్దదెబ్బ కొట్టింది.మార్కెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి.ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒక్క రోజులోనే భారీగా నష్టపోయారు.ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద రూ.1.5 లక్షల కోట్ల మేర తరుగుదలయ్యింది.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రూ.1.3 లక్షల కోట్లు నష్టపోయారు.

అమెరికా మార్కెట్లు 2022 తరువాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
S&P 500 సూచిక 275 పాయింట్లు పడిపోయింది.
నాస్‌డాక్ 1,053 పాయింట్లు నష్టపోయింది.
డౌజోన్స్ సూచిక 1,682 పాయింట్లు కోల్పోయింది.
ఇతర ప్రముఖుల పరిస్థితి కూడా భయంకరంగానే ఉంది.
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రూ.63 వేల కోట్లు నష్టపోయారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రూ.6,363 కోట్లు పోగొట్టుకున్నారు.
గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వరుసగా రూ.41,000 కోట్లు, రూ.39,000 కోట్లు నష్టపడ్డారు.
సుందర్ పిచాయ్ రూ.153 కోట్లు, టిమ్ కుక్ రూ.581 కోట్లు నష్టపోయారు.

ఈ పన్నుల మార్పులు అంతర్జాతీయ మార్కెట్లపై భారీ ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు రావొచ్చని UBS విశ్లేషకులు తెలిపారు. వ్యాపార సంస్థలు లాబీయింగ్ మొదలుపెడతాయని, చర్చలతో పరిష్కారం కావొచ్చని అభిప్రాయపడ్డారు.
IEEPA చట్టం ఆధారంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతకుముందెన్నడూ ఈ చట్టం ఈ స్థాయిలో వాడలేదు. ఇదే ట్రంప్‌కు వ్యతిరేకంగా నూతన చర్చలకు దారితీసే అవకాశముంది.

*హైదరాబాద్: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసం..*

పాతబస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా సోషల్‌ మీడియాలో ప్రచారం..

ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్‌కి జట్టు మొలిపించానంటూ ప్రచారం..

బిగ్‌బాస్‌ సెలూన్‌ ముందు క్యూ కట్టిన వందలాది మంది యువకులు..

గుండు గీసి కెమికల్స్‌ రాసి పంపిన వకీల్‌..

సైడ్‌ ఎఫెక్ట్‌ రావడంతో లబోదిబోమంటున్న యువకులు..

ఆస్పత్రుల్లో చేరుతున్న బాధిత యువకులు..

*ఆహారకల్తీ.. రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్*

ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉండటం గమనార్హం. 2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీవిగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది.

ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. కేరళ 13.11 శాతం, ఆంధ్రప్రదేశ్ 9 శాతం, కర్ణాటక 6.30 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి..

BRS నేత క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు.

కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఉపయోగించి..
సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేశారని నోటీసులు
ఈ నెల 9, 10, 11 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు
బీఆర్‌ఎస్ నేతలు నకిలీ వీడియోలు రిలీజ్ చేశారని కేసులు నమోదు అయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ ఐటీ సెల్‌పై ఈ కేసులు రిజిస్టర్ అయ్యాయి. సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ దిలీప్‌, బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్‌పై 353, 1(C), 353(2), 192, 196(1),61(1)(a)బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

అధికారులను సంప్రదించకుండా ఎలాంటి నిర్దారణ చేసుకోకుండా ప్రజల్లో అలజడి రేపేందుకు నకిలీ వీడియోలు విడుదల చేశారని కేసుషీట్‌లో పేర్కొన్నారు. కావాలని ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపారు. ఫిర్యాదుల్లో కూడా వాటిన పొందుపరిచారు. .

తనపై కేసులు పెట్టడంపై బీఆర్‌ఎస్ నేత కిషాంక్ స్పందించారు. ఎక్స్‌లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. కృత్రిమ మేధస్సును, చిత్రాలను లేదా వీడియోలను సృష్టించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వైల్డ్‌ లైఫ్ & ట్రీస్ ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా నమ్మినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయడం సరైనదేనా అని నిలదీశారు. ఆ నాలుగు వందల ఎకరాల భూములు రక్షించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాను…రాజాసింగ్

ఒవైసీ బ్రదర్స్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్ను…కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు..

పీఎంను అవమానించడమే: అన్నామలై.

రామేశ్వరంలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గైర్హాజర్ కావడం ఆసక్తికరంగా మారింది..ఇప్పటికే త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది..ప్రధాని పాంబన్ వంతెన ఆవిష్కరణలో ఉండగా, ఇదే సమయంలో ఉదగమండలం (ఊటీ)లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొన్నారు. రామేశ్వరంలో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేనంటూ తన అసక్తతను ప్రధాని మోదీకి తెలియజేసినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ”నియోజకవర్గాల పునర్విభజనపై మెమొరాండం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ కోరాం. నేను ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆ (మోదీ) సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు తెలియజేశాను. ప్రభుత్వం తరఫున మంత్రులు తంగం తెన్నరసు, రాజా కన్నప్పన్‌లను పంపుతున్నట్టు చెప్పాను. డీలిమిటేషన్ పట్ల తమిళనాడు ప్రజలకు ఉన్న భయాలను తొలగించాలని ప్రధానిని ఈ సందర్భంగా కోరుతున్నాను” అని స్టాలిన్ తెలిపారు.

పీఎంను అవమానించడమే: అన్నామలై

ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చెప్పిన కారణం ఆమోదయోగ్యం కాదని, పీఎం వస్తు్న్న విషయం ఆయనకు తెలుసునని అన్నారు. ప్రధాని మోదీ శ్రీలంక నుంచి ఢిల్లీకి వెళ్లకుండా నేరుగా ఇక్కడకే (రామేశ్వరం) వచ్చారని, ఆయనకు స్వాగతం పలకాల్సిన ప్రాథమిక బాధ్యత సీఎంకు ఉందని అన్నారు. ప్రధాని సమావేశాన్ని బహిష్కరించడం ఆయనను అవమానించడమేనని, అందుకు తమిళనాడు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..

సచివాలయంలో మంత్రుల కమిటీతో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ సమీక్ష..మంత్రి బండి సంజయ్‌.

సచివాలయంలో మంత్రుల కమిటీతో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ సమీక్ష చేయడమేంటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్‌ స్టాంపులా మారారన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారమని, కానీ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడం.. సచివాలయంలో కాంగ్రెస్‌ నేత సమీక్ష చేయడం, హెచ్‌సీయూ భూముల వ్యవహారం వంటివి తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ సొమ్మును దోచుకుని ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటై మజ్లి్‌సను గెలిపించాలనుకుంటున్నాయని ఆరోపించారు. దేశద్రోహ ఎంఐఎం, దేశభక్త బీజేపీ మధ్య హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జరుగుతోందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఏనాడో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కేంద్రం సంక్షేమ పథకాలను తెలంగాణలో పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. సన్నబియ్యం పథకానికి కేంద్రం రూ.37 ఇస్తుంటే రాష్ట్రం రూ.పది మాత్రమే భరిస్తోందని చెప్పారు. అలాంటప్పుడు రేషన్‌ షాపుల వద్ద మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని సంజయ్‌ ప్రశ్నించారు..