అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనలననుసరించి తెల్ల రేషన్ కార్డులు మంజూరి… మంత్రి ఉత్తమ్

సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు పంపిణి లాంటి సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో నిలిచిపోతాయని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Nalamada Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కౌండిన్య ఫంక్షన్ హాల్ లో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకి నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.. సన్నబియ్యం పంపిణీ కార్యక్రామాన్ని హుజుర్నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించుకోవడం ఆనంద దాయకమని ఆయన పేర్కొన్నారు

మంగళవారం రోజున హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలసి ఆయన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు

కోటాను కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసినా ప్రజలు వినియోగించుకునేందుకు అయిష్టత చూపడంతో అవి పక్క దోవ పట్టాయన్నారు

ప్రజాభీష్టానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా మంత్రివర్గ సమిష్టి నిర్ణయంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు

స్వతంత్ర భారత దేశంలోనే సన్నబియ్యాన్ని ఉచితంగా పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమే నని ఆయన పేర్కొన్నారు.

పౌరసరఫరాల శాఖా ప్రధాన కార్యదర్శి డి ఎస్ చౌహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు

అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనలననుసరించి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు

పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేదలను నిర్లక్ష్యం చేసారని ఆయన మండిపడ్డారు. అర్హులైన వారెవరికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు అందించలేక పోయారని ఆయన విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏక కాలంలో 7 లక్షల 95 వేల 685 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు

తద్వారా కొత్తగా 33 లక్షల 97 వేల 367 మందికి లబ్ది చేకూరిందని ఆయన వివరించారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 89 లక్షల కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 3 కోట్ల 78 లక్షల 367 మందికి చేరిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడినా ఖాతరు చేయకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి నిరుపేద కడుపు నింపేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు

హుజుర్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా మారిందన్నారు.మొన్నటి లోకసభ ఎన్నికల్లో యావత్ భారతదేశంలోనే హుజుర్నగర్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసుకుందని ఆయన చెప్పారు

కాంగ్రెస్ పార్టీకీ,ప్రభుత్వానికి కార్యకర్తలే మూలస్తంభాలన్నారు.

ఎత్తిపోతల పథకాలతో హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు

18 ఏళ్ల తరువాత జులై నెలలో నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేశామన్నారు

సాగర్ ఆయాకట్టు రైతాంగం ఆశీర్వాదాలతోటే తాను ఆరుసార్లు శాసనసభకు ఒక మారు లోకసభకు ఎన్నికయ్యమన్నారు

అటువంటి రైతాంగం ఆశీర్వాదాలతో నీటిపారుదల శాఖామంత్రిగా సాగర్ నీటి విడుదల చేయడం తన అదృష్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.