13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. మరో నల్ల త్రాచును మింగేసిన రాచనాగు
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ఖండివరం గ్రామంలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వ్యవసాయ క్షేత్రంలో 13 అడుగుల పొడవున్న రాచనాగు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఉదయాన్నే పశువుల పాక వద్దకు పాల కోసం వెళ్లిన రైతులకు భారీగా బుసలు కొడుతూ కనిపించిన కింగ్ కోబ్రాను చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని సుమారు 6 కిలోల బరువు, 13 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం దానిని స్థానిక అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
కాగా, ఈ కింగ్ కోబ్రా మరో నల్ల త్రాచును మింగేసినట్లు స్థానికులు తెలిపారు. భారీ రాచనాగు గ్రామంలో ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
https://x.com/UttarandhraNow/status/2089906038116118951?s=20