నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ…!

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు

గంజాయికి అలవాటు పడి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం హత్య చేసినట్లు నిర్ధారణ

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు అరెస్ట్

ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య

ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు

ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు

ఆమె ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి

ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకెళ్లిన విద్యార్థులు

ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు, ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు

ఎట్టకేలకు కనిపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు
నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ వీడింది. అదే స్కూల్‌కు చెందిన పదోతరగతి చదువుతున్న విద్యార్థులు హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 11న దారుణ హత్యకు గురైన రూపారెడ్డి హత్యపై అనేక అనుమానాలు తలెత్తాయి.

పోలీసులు కీలక ఆధారాలు…వారం రోజులుగా సంచలనం సృష్టించిన రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. గంజాయి తాగుతుండగా రూపారెడ్డి ఈవెనింగ్ వాకింగ్ లో తన సెల్ ఫోన్లో వీడియో తీసి తల్లిదండ్రులకు చూపుతానని బెదిరించడంతోనే విద్యార్థులు ఈ దారుణ హత్యకు పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా గంజాయికి పాల్పడిన వారు రూపారెడ్డి బెదిరించడంతోనే ఆమెను హత్య చేయాలని నిర్ణయించారు. డబ్బు కోసం కూడా…అంతేకాదు..స్కూల్ లో వసూలు చేసిన ఫీజు డబ్బులు రూపారెడ్డి వద్ద ఉన్నాయని గుర్తించిన మైనర్లు డబ్బుల కోసం రూపారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వాకింగ్ నుంచి ఇంట్లోకి రాగానే ఇంటి వెనక భాగం నుంచి ప్రవేశంచడంతో రూపారెడ్డి నిందితులను గుర్తు పట్టారు. దీంతో ఆమెను కత్తితో కిరాతకంగా హత్య చేసి అనంతరం నిందితులు గోవా పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లయింది..

గంజాయి వ్యవహారమే కారణమా?.

పోలీసుల దర్యాప్తులో.. కొందరు విద్యార్థులు గంజాయి సేవిస్తున్న విషయాన్ని రూపారెడ్డి గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని ఆమె హెచ్చరించడంతో విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆమె వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వస్తే తమ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది….

సుమారు 120 మందికి పైగా అనుమానితులను విచారించగా, అందులో పాఠశాల పాత విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. కాల్ డేటా రికార్డ్స్‌, స్థానిక నెట్‌వర్క్ ఆధారంగా విచారించారు. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలు చెందిన ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

హత్యకు దారి తీసిన కారణాలు
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం… ఈ ఘాతుకానికి ప్రధాన కారణం గంజాయి వ్యసనం. కొద్దిరోజుల క్రితం నిందితులైన విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని మందలించడమే కాకుండా, వారు గంజాయి సేవిస్తున్న సంగతిని తన మొబైల్‌లో ఫొటోలు తీశారు. వీడియో షూట్ చేశారు.

ఈ ఆధారాలు ఆమె వద్ద ఉంటే తమ భవిష్యత్ నాశమవుతుందని, పాఠశాలలో పరువుప పోతుందని భావించిన విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడానికి పథకం వేశారు. పక్కా ప్లాన్ ప్రకారం గ్లౌజులు, మాస్క్‌లు ధరించి ఆమె ఇంట్లోకి ప్రవేశించి కేవలం 9 నిమిషాల్లోనే హత్య చేశారు. హత్య అనంతరం ఆధారాల కోసం మె మొబైల్‌ ఫోన్‌ను తీసుకొని పారిపోయారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల వరకు నగదును కూడా వారు దోచుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.