సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ..
• మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో భారీ చోరీ..
• కోదాడలోని రంగా థియేటర్ వద్ద బస్సు ఎక్కిన ప్రయాణికుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 15 తులాల బంగారాన్ని దొంగలించినట్లు బాధితురాలు పిర్యాదు .
• కోదాడ నుంచి హుజూర్నగర్కు వెళ్తుండగా మార్గమధ్యలోనే చోరీ…
• దొంగలించిన బంగారం విలువ సుమారు 25 లక్షలు ఉంటుందన్నా బాధితులు .
• హుజూర్నగర్కు చెందిన తోలుపునూరి పద్మావతి, సూర్యప్రకాశ్ బాధితులుగా పోలీసులకు పిర్యాదు
• ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పోలీసులు….
హుజూర్నగర్కు చెందిన తోలుపునూరి పద్మావతి, సూర్యప్రకాశ్ దంపతులు వ్యక్తిగత పనిపై కోదాడ వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో కోదాడలోని రంగా థియేటర్ వద్ద మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంది. దీన్ని గమనించిన గుర్తుతెలియని దొంగలు క్షణాల్లో తమ చేతివాటం ప్రదర్శించారు. బస్సు కోదాడ నుంచి హుజూర్నగర్కు బయలుదేరి మార్గమధ్యలో ఉండగా, ప్రయాణికుల రద్దీ మధ్యలో దంపతుల వద్ద ఉన్న బ్యాగ్ను టార్గెట్ చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన దుండగులు.. వారి వద్ద ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను లూటీ చేశారు..
కన్నీరు మున్నీరుగా పిలపించిన బాధితురాలు..
గమ్యస్థానానికి చేరుకున్నాక బ్యాగ్ను పరిశీలించుకున్న బాధితులకు గుండె ఆగినంత పనైంది. బ్యాగ్లో భద్రపరుచుకున్న బంగారు నగలు మాయమవడంతో ఒక్కసారిగా లబోదిబోమన్నారు. పోయిన బంగారం విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు