ఎథిక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరయ్యేందుకు అసెంబ్లీకి చేరుకున్న పాడి కౌశిక్ రెడ్డి.

కాసేపట్లో ఎథిక్స్ కమిటీ సమావేశం ప్రారంభం

పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై చర్చ

అసెంబ్లీకి చేరుకున్న ఎథిక్స్ కమిటీ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, పద్మారావు గౌడ్

ఎథిక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరయ్యేందుకు అసెంబ్లీకి చేరుకున్న పాడి కౌశిక్ రెడ్డి..

అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్‌లో జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy), కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై చేసిన అనైతిక ప్రవర్తన, అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఈ భేటీలో కమిటీ విచారణ జరపనుంది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైతికత కమిటీకి సమీక్షకు పంపించారు. ఈ మేరకు విచారణను వేగవంతం చేస్తూ, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఈ సమావేశానికి సంబంధించి అధికారికంగా లేఖ జారీ చేశారు…