రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు..!.

రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఫీవర్ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రోజు సుమారు 600లకు పైగా ఓపీ వస్తుండటం గమనార్హం. ఇన్పేషంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా సెప్టెంబర్ మధ్యలో సున్నాగా ఉన్న డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు ఓపీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫీవర్ ఆస్పత్రికి పెరుగుతున్న ఫీవర్ కేసులు..

ఫీవర్ ఆసుపత్రికి వచ్చే కేసులు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఓపీ ఎంత మేరకు ఉంది?
ఓపీలు మాములు కన్నా ఎక్కువగానే వస్తున్నాయి. ఒక్కోసారి 600 లేదా అంతకంటే ఎక్కువ కూడా పేషెంట్లు వస్తుంటారు. వైరల్ జ్వరాలు ఎక్కువ కావటంతో ఓపీ కూడా పెరిగింది.

ప్రధానంగా ఎలాంటి లక్షణాలతో ఆసుపత్రికి రోగులు వస్తున్నారు? వారికి ఎన్ని రోజుల నుంచి లక్షణాలు ఉంటున్నాయి?
సాధారణంగా జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, తలనొప్పి లక్షణాలతో మా దగ్గరకు వస్తున్నారు. మేము పరీక్షలు చేసి విష జ్వరమని తేలితే చికిత్స చేస్తున్నాం. మలేరియా పేషెంట్లు ఎక్కువగా రావట్లేదు. డెంగ్యూ కేసులు మాత్రం అప్పుడప్పుడు వస్తున్నాయి. అధికంగా విష జ్వరాలకు సంబంధించిన కేసులే వస్తున్నాయి.

పెద్దవాళ్లు ఎక్కువగా వస్తున్నారా? లేదంటే చిన్నపిల్లలు వస్తున్నారా?
అధికంగా మధ్య వయసు ఉన్నవాళ్లే ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు కూడా వస్తున్నారు. కానీ మధ్య వయసు వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి. దానివల్ల ప్రస్తుతం జ్వరాలు వస్తున్నాయి. అలాగే మొన్న పండుగలు జరిగాయి. అక్కడ అధిక సంఖ్యలో తిరగటంతో ఇవి వ్యాప్తి చెందుతున్నాయి…

జ్వరాలు అధికంగా వస్తున్నాయి. జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రధానంగా అందరూ వర్షంలో తడవొద్దు. అలాగే వర్షం వచ్చేటప్పుడు బయట ఎక్కువగా తిరగొద్దు. ఈ దోమల కాటు వల్లనే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వస్తాయి. మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు, కాళ్లు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. మస్కిటో నెట్లను వాడాలి. తలుపులకు, కిటికీలకు దోమలు రాకుండా మెస్లు పెట్టించుకోవాలి. అలాగే ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లు నిలిచే ప్రదేశాల్లో నీటిని వెంటనే తీసేయాలి. వాష్రూమ్కు వెళ్లిన వెంటనే చేతులు కడుక్కోవాలి. మనం తినే ఆహారం తాజాగా ఉండాలి. అందుకే బయట ఆహారం కాకుండా ఇంటి ఫుడ్ తీసుకోవటమే ఉత్తమం. ప్రతిదాన్ని వేడి చేసుకుని తింటే వాంతులు, విరోచనాలు రాకుండా ఉంటుంది. ప్రధానంగా చిన్న పిల్లలు, పెద్దలు అలాగే గర్భీణీలు తప్పక పాటించాలి.

ఈ ఫీవర్ ఆసుపత్రిలో అన్నీ రకాల మందులు అందుబాటులో ఉన్నాయా?
మా దగ్గర అన్నీ ఉన్నాయి. యాంటిబయోటిక్స్, యాంటి ఫ్లూయిడ్స్ కూడా ఉన్నాయి. అడ్మిట్ చేసుకున్న వారికి బయట నుంచి ఏ మందులు రాయట్లేదు. ఇక్కడే అన్నీ సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నుంచే చికిత్సను అందిస్తున్నాం. ఒకవేళ జనాలు ఎక్కువ స్థాయిలో పెరిగినా మా దగ్గర ఎక్కువ స్టాక్ ఉంది. వాళ్లకోసం బెడ్లు, మందులు, స్టాఫ్ కూడా ఉన్నారు.

నిమ్మకు నీరు ఎత్తినట్టుగా అధికారులు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్లు విజయం ఇస్తున్న వేళ… కనీసం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తోంది.. ముఖ్యంగా తెలంగాణలో వైరల్ ఫీవర్ బారిన పడ్డ బాధితుల సంఖ్య గణనీయంగా పెరగటం .. అందుకు తగినట్టుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది… ముందస్తు మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడంలో ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యా వాదనను పలువురు తెరపైకి తెస్తున్న వాదన… పేదలకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు..

ప్రైవేట్ ఆస్పత్రుల ధనదాహానికి అడ్డుకట్ట వేయడంలో జిల్లా వైద్య అధికారులు కూడా విఫలం..

బ్లడ్ టెస్ట్ లు మరియు ఇతర రకాల అన్ని టెస్టుల పేర్లతో అమాయకుల వద్ద నుండి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్న కానీ కనీసం ప్రభుత్వ అధికారులు, సంబంధిత వైద్యశాఖ అధికారులు స్పందించకపోవడం పై పలు విమర్శలకు భావిస్తోంది.. పేద ప్రజలు ఈ కరువులో పైసలు పెట్టుకొని ప్రాణాలు దక్కించుకోవడం చాలా కష్టంగా మారింది.. ప్రాణ భయంతో అప్పు చేసి మరి ప్రైవేట్ ఆస్పత్రికి వెళుతుంటే అక్కడ ధన దాహానికి వారు తెచ్చుకున్న డబ్బు ఒక్కరోజు కూడా ఉండేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలానే ధర దాహంతో ప్రైవేట్ ఆసుపత్రిలు అమాయక రోగుల దగ్గర నుంచి డబ్బు దోచుకుంటే ఇక తాము బ్రతుకుతెరవే కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు..