నైజీరియాలో కూలిన సైనిక విమానం.
నైజీరియా ఆర్థిక రాజధారి లాగోస్‌కు సమీపంలోని ఇగ్బోకోడా నదీతీర పట్టణంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ప్రమాదం సమయంలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి విమానం గుర్తు పట్టలేనంతగా ముక్కలు అయ్యింది. ఈ ఘటన గురించి తెలియగానే ఆ ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది..
ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు.
బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు..
నైజీరియా వైమానిక దళానికి చెందిన ఏటీఆర్-42 విమానం సోమవారం సాధారణ మిషన్‌లో భాగంగా బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు బయలుదేరింది.
విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 8:13 గంటలకు (జీఎంటీ) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు తెగిపోయాయి
“అధ్యక్షుడు బోలా టినుబు ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. నైజీరియాకు చెందిన వైమానిక విమానం, ATR-42గా గుర్తించారు. వైమానిక విమానం బెనిన్ నుండి లాగోస్‌కు వెళ్తుండగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.13 గంటలకు విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత అతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు తెగిపోయాయి. చివరకు ఓ వైమానిక స్థావరం వద్ద కూలినట్టు ఆ దేశ మీడియా చెబుతోంది.
దర్యాప్తుకు ఆదేశించిన ఆ దేశ అధ్యక్షుడు
విమానం నది సమీపంలో కూలిపోయిందని, దానిలోని కొంత భాగం నీటిలో మునిగిపోతోందని స్థానికులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇగ్బోకోడాలోని నావికా స్థావరానికి సమీపంలో శిథిలాలను గుర్తించారు. ఈ ఘటనలో మరణించిన 32 మంది కుటుంబాలకు నైజీరియా వైమానిక దళానికి అధ్యక్షుడు టినుబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.”