రష్యా వెళ్లి అక్కడ యువతితో ప్రేమలో పడిన బీహార్‌కు చెందిన రాహుల్..

బీహార్ యువకుడితో ప్రేమ.. ఇండియా ఇద్దరు వచ్చేసిన రష్యా యువతి ఉపాధి కోసం రష్యా వెళ్లి అక్కడ యువతితో ప్రేమలో పడిన బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ అనే యువకుడు రాహుల్ ఇండియాకు తిరిగి రాగా, అతను లేకుండా 6 నెలల తర్వాత ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన రష్యా యువతి రాహుల్ గుడిసెలో ఉంటున్నాడని తెలిసిందని, నవంబర్‌లో పెళ్లి చేసుకున్న పెద్దలు..
https://x.com/TeluguScribe/status/2109971329730707792?s=20ప్రేమకు సరిహద్దులు వుండవు. కులమతాలు వుండవు. రెండు మనసులు ఒకటైతే ఇక పెళ్లి వైపు అడుగులు పడిపోతాయి. ఇక అసలు విషయానికి వస్తే… బీహార్ యువకుడి కోసం రష్యా నుంచి వచ్చింది ఓ యువతి. దీనికి కారణం… కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ యాదవ్ అనే యువకుడు రష్యాలో ఉపాధి కోసం వెళ్లాడు. అక్కడ కొన్నిరోజులు పని చేసాడు.

ఈ క్రమంలో అతడికి అక్కడ ఓ రష్యన్ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఐతే వర్క్ కాంట్రాక్ట్ ముగియడంతో ఇండియాకి తిరిగి వచ్చేసాడు రాహుల్. కానీ ప్రియుడిని వదిలి వుండలేని రష్యా యువతి తన కుటుంబంతో సహా కలిసి రాహుల్ కోసం బీహారు వచ్చేసింది. ఓ చిన్న పూరిగుడిసెలో వుంటున్నాడని తెలుసుకున్నది. ఐనప్పటికీ అతడినే వివాహం చేసుకుంటానని చెప్పడంతో నవంబర్ నెలలో వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు.