తల్లి కోసం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను పరుగు పెట్టి దర్శనం,

కన్నతల్లి అనారోగ్యం నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతురాలైతే దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను పరుగు పెట్టి వచ్చి దర్శనం చేసుకుంటానని ఓ బీహార్ యువకుడు మొక్కుకున్నాడు. ఆ పరమేశ్వరుడి కృపతో అతడి తల్లి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. దీనితో తను శివుడికి మొక్కు చెల్లించుకునేందుకు పరుగు మొదలుపెట్టాడు ఆ యువకుడు…
ప్రస్తుతం అతడు బీహార్ రాష్ట్రం నుంచి జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు రోడ్డుపై పరుగు తీస్తున్నాడు. తల్లి పట్ల అతడికి వున్న ఎనలేని ప్రేమాభిమానాలను చూసి అతడిని ప్రశంసిస్తున్నారు. రోడ్డుపై అతడు పరుగు పెడుతున్న సమయంలో పలువురు అతడిని అభినందిస్తూ అతడితో కలిసి నడుస్తున్నారు.
https://x.com/rameshofficial0/status/2110204794271138109?s=20మార్చి నుంచి మొదలు:

మోను తన పరుగును 2026 మార్చి 15న పాట్నా నుంచి ప్రారంభించాడు. ప్రతి రోజు 50 కిలోమీటర్లు పరిగెడతాడు. అయితే జ్యోతిర్లింగాలతో పాటు చార్ దామ్ యాత్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు.

పాట్నా నుంచి మొట్టమొదట జార్ఖండ్ లోని బాబా బైద్యనాథ్ ధామ్ ను దర్శించుకున్న మోను.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్ర నాషిక్ లోకి త్రయంబకేశ్వరం మొదలైన తీర్థ స్థలాలను దర్శించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని పార్లీ వైజ్ఞాత్ జ్యోతిర్లింగాన్ని కూడా ఇప్పటికే దర్శించుకున్నాడు.

బ్లాక్ పాంథర్ మోనూ..

మోనూను అందరు బ్లాక్ పాంథర్ మోనూ అని పిలుస్తున్నారు. అమ్మ కోసం మోనూ చేపట్టిన యాత్ర గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోనూ ప్రయాణించే దారులలో జనాలు నీరాజనం పడుతున్నారు. దైవ అనుగ్రహంతోనే ఇలాంటి క్లిష్టమైన యాత్ర చేస్తున్నాడని కొందరు దేవుడిలా చూస్తున్నారు. కొందరు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.