సీఎం చంద్రబాబుతో జనసేన సమన్వయ సమావేశం.
సీఎంతో చర్చలు ముగిశాయి-బొలిశెట్టి శ్రీనివాస్.
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పంపకాలు
కలిసి పోటీచేస్తాం.. మెజార్టీ సీట్లు గెలుస్తాం
మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు-బొలిశెట్టి.
ఎవరికి ఎక్కువ బలం ఉంటే అక్కడ పోటీచేయాలని నిర్ణయం.
ఎలాంటి పర్సంటేజీల కోసం చర్చించలేదు
సీట్లు కాదు..
గెలుపే ముఖ్యం-బొలిశెట్టి శ్రీనివాస్..
కూటమిగానే అభ్యర్థులను ప్రకటిస్తాం-బొలిశెట్టి
పోటీపై కూటమి పార్టీల మధ్య స్పష్టత..
పవన్ కోరుకున్న విధంగానే సీట్ల సర్దుబాటు-…
“స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ లేదని, సింగిల్ ఎజెండాతోనే కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్(Mla Bolisetty Srinivas) తెలిపారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu)తో జనసేన(Janasena) నేతల చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చాయని చెప్పిన బొలిశెట్టి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. సీట్ల సర్దుబాటులో ఎవరి మనోబావాలు దెబ్బతినకుండా చూస్తామని చెప్పారు. 2024లో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని బొలిశెట్టి పేర్కొన్నారు. పార్టీ బలాన్ని బట్టి అక్కడ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. సీట్ల కంటే గెలుపు ముఖ్యంగా పని చేస్తామన్నారు. కూటమిగానే అభ్యర్థులను ప్రకటిస్తామని బొలిశెట్టి తెలిపారు. ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయంపై తమ మధ్య క్లారిటీ ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కోరుకున్న విధంగానే సీట్ల సర్దుబాటు ఉంటుందన్నారు. . సీట్ల పంపకాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామన్నారు. కూటమిగానే పోటీ చేసి మెజార్టీ సీట్లు గెలుస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.”..