రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.
విద్యుత్ సరఫరాలో మార్పు ఎందుకు రావడం లేదు.
విద్యుత్ ఉత్పత్తి పెంచకపోవడంపై అధికారులపై ఫైర్.
యాదాద్రి ప్లాంట్లో ఎందుకు ఉత్పత్తి జరగడం లేదు.
నిర్లక్ష్యం చేస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు
స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీని సస్పెండ్ చేస్తా
పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ ఇవ్వాలని..
చాలాసార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు-రేవంత్.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ కొరత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ సంక్షోభాన్ని ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ తింటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, వచ్చే జూన్ వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు..”ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంద ని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. ‘విద్యుత్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు మార్కెట్లోనే విద్యుత్ దొరికే పరిస్థితి లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న విద్యుత్ను చాలా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. విద్యుత్ ఆధారితంగా జరిగే అత్యవసరం కాని పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.”