సైనిక్‌పురిలో కలకలం..! అన్నదాన ప్రసాదంపై చేపల పొట్టు.. మహిళ అరెస్ట్!

సైనిక్‌పురిలో కలకలం..! అన్నదాన ప్రసాదంపై చేపల పొట్టు.. మహిళ అరెస్ట్!

హైదరాబాద్ సైనిక్‌పురి ఆర్‌కే పురంలో దేవి నవరాత్రుల వేళ తీవ్ర కలకలం రేగింది.
స్థానిక మైసమ్మ ఆలయం వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
అక్కడకు వచ్చిన ఒక స్థానిక మహిళ భక్తులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ప్రసాదంపై చేపల వ్యర్థాలు చల్లడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పవిత్రమైన పూజా సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం కోసం నిరసనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

భక్తుల నిరసనలతో పోలీసులు వేగంగా స్పందించి చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత సద్దుమణిగింది.