ఇండియాలో ఎలాంటి తీవ్రవాద దాడి జరిగినా ఇకపై తీవ్రంగా పరిణామాలు దారుణంగా ఉంటాయి … కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్..

పాకిస్తాన్ వైపు నుంచి మరోసారి ఇండియాలో ఎలాంటి తీవ్రవాద దాడి జరిగినా ఇకపై తీవ్రంగా స్పందిస్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు..సరిహద్దు తీవ్రవాదాన్ని అణచివేయడంలో ఇండియా రాజీపడబోదని మరోసారి పునరుద్ఘాటించారు. శాంతి, ద్వైపాక్షిక చర్చలకు ఇండియా ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అంతమాత్రాన దాన్ని ఇండియా బలహీనతగా భావించవద్దన్నారు. ‘‘తీవ్రవాదంపై భారత్ స్పందించే విధానంలో నిర్ణయాత్మక మార్పు వచ్చింది. భారత్‌కు పొంచి ఉన్న ముప్పును మూలాల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ ఎయిర్‌ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ వంటి సైనిక చర్యలే ఇందుకు ఉదాహరణలు. ద్వైపాక్షికంగా దాడుల్ని ఖండించే స్థాయి నుంచి గట్టి బదులిచ్చే చర్యలకు దిగుతున్నాం. తీవ్రవాదాన్ని మూలాల నుంచి అంతం చేస్తున్నాం.

ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడిన వారిని సగటున ఏడాదిలో అంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. శాంతి నెలకొనాలి అంటే సైనికంగా బలోపేతం కావాలి. సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలి. ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టాలి. డిజిటల్ టెక్నాలజీతోపాటు సంప్రదాయేతర భద్రతా ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా 5డీ భద్రతా ముప్పు ఉంది. అది.. తప్పుడు సమాచారం, అస్థిరత, అంతరాయం కలిగించడం, మోసం, విధ్వంసం’’ అని రాజ్‌నాథ్‌ సింగ్ వ్యాఖ్యానించారు..