పూజలో శంఖం ఎందుకు ఊదుతారు?.
Conch Shell
హిందూ సనాతన ధర్మంలో పూజలు, యజ్ఞయాగాలు, పండుగలు మరియు శుభకార్యాల సమయంలో శంఖం ఊదడం (శంఖనాదం) అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు పౌరాణిక కారణాలు ఉన్నాయి.
మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక ఆచారం ప్రకారం.. పూజ పూర్తయ్యే ముందు శంఖం ఊదకూడదు. పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తెరవడంలో కూడా శంఖాన్ని ఊదడం జరుగుతుంది. శంఖానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉందంటే.. అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుంచి బయటకు వచ్చింది. ఆ శంఖాన్ని శ్రీమహావిష్ణువు ధరించారు. దానికే “పాంచజన్యం” అని పేరు. ఆ తర్వాత లక్ష్మీ దేవిని కూడా స్వామి ఆ శంఖం వెంబడి స్వీకరించారు. అందువల్ల శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా కూడా వర్ణిస్తారు. ఇంట్లో లేదా దేవుని గదిలో శంఖాన్ని ఉంచి దానిలో నీరు నింపితే.. అది శుభఫలాలను తెస్తుందని నమ్మకం ఉంది. శంఖానికి రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ..
1. ఆధ్యాత్మిక & పౌరాణిక ప్రాముఖ్యత
శంఖం నుంచి వెలువడే నాదం ప్రణవ నాదమైన “ఓంకార ధ్వని”తో సమానం. సృష్టికి మూలమైన ఈ నాదం మనస్సును క్షణాల్లో ప్రశాంతపరచి, ధ్యానం మరియు దైవచింతనకు అనుకూలంగా మారుస్తుంది.
క్షీరసాగర మథనంలో శంఖం, లక్ష్మీదేవి ఇద్దరూ ఉద్భవించారు. అందుకే శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా, విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఆయుధంగా (పాంచజన్యం) పూజిస్తారు. శంఖం ఉన్న చోట, శంఖధ్వని వినిపించే చోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు
శంఖనాదం వల్ల వచ్చే గంభీరమైన తరంగాలు ఇంట్లోని ప్రతికూల శక్తులను (నెగెటివ్ ఎనర్జీ), దుష్ట శక్తులను పారద్రోలి, సానుకూల తరంగాలను (పాజిటివ్ వైబ్రేషన్స్) వ్యాపింపజేస్తాయి.
☘️🌻🌻🌻🌻🌹🌻🌻🌻🌻☘️
2. శాస్త్రీయ & ఆరోగ్య ప్రయోజనాలు
శంఖాన్ని ఊదినప్పుడు వెలువడే ప్రత్యేక ఫ్రీక్వెన్సీ తరంగాలు పరిసరాల్లోని హానికర సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలను నశింపజేస్తాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.
శంఖం ఊదడం ఒక శక్తిమంతమైన శ్వాస వ్యాయామం (ప్రాణాయామం వంటిది). దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది.
ఊదే సమయంలో డయాఫ్రమ్, ఛాతీ కండరాలు సంకోచించి రక్తప్రసరణ మెరుగవుతుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమై స్వరపేటికకు బలాన్నిస్తుంది.
పురాణశాస్త్రం
పురాణాల ప్రకారం, శంఖానికి రాక్షసులతో సంబంధం ఉంది. ఒక కథ ప్రకారం, శంఖచూడుడు అనే అసురుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. విష్ణుమూర్తి శంఖచూడుడిని సంహరించగా, అతని శరీరం నుండి ఒక శంఖం ఉద్భవించింది. ఆ శంఖచూడుడు, శ్రీకృష్ణుని స్నేహితుడైన సుదాముడు. రాధ శాపం వల్ల అతను ఒక రాక్షసుడి గర్భంలో జన్మించాడు. శంఖచూడుడు విష్ణు భక్తుడు కాబట్టి, లక్ష్మీ-విష్ణువులకు శంఖజలం అంటే చాలా ఇష్టం. అందుకే దేవతలందరికీ శంఖజలాన్ని సమర్పించడం ఒక నియమంగా ఉండేది. కానీ శివుడు అతన్ని సంహరించాడు కాబట్టి, శివునికి శంఖజలం సమర్పించడం నిషిద్ధం. అందువల్ల, శివారాధనలో శంఖాన్ని ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది..
3. వాస్తు పరమైన లాభాలు
ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు, ప్రతిరోజూ క్రమం తప్పకుండా శంఖం ఊదడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది.
పూజలో శంఖాన్ని ఊదడంతో పాటు, శంఖంలో నీరు నింపి పూజ ముగిసిన తర్వాత ఆ జలాన్ని ఇల్లంతా చల్లడం వల్ల గృహ శుద్ధి జరుగుతుంది.
దక్షిణావృత శంఖం.. ఇది తెల్లటి రంగులో, పైకి కాఫీ రంగు గీతలు ఉంటాయి. ఇది కుడి వైపు తెరుచుకుంటుంది. సాధారణ పూజలలో ఎక్కువగా వాడబడదు. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే, కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయని భావిస్తారు.
వామావృత శంఖం.. ఇది ఎడమ వైపు తెరుచుకుంటుంది, అన్ని పూజలలో ఎక్కువగా వాడే శంఖం. ఇంట్లో ఉంచినప్పుడు దుష్ట శక్తులు ఆ ప్రాంతానికి దగ్గర వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, పూజలో శంఖం ఉపయోగించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, అది శుభం, సౌభాగ్యాన్ని, రక్షణను కూడా సూచిస్తుంది.
పవిత్రత: శంఖం ధ్వని చెవులకు శాంతినిస్తుంది, మానసిక శాంతి కలిగిస్తుంది. శంకర, విష్ణు, కృష్ణుడు వంటి దేవతల పూజలో శంఖం తప్పనిసరిగా వాడబడుతుంది. దుర్గుణ నివారణ: శంఖం వాయించే శబ్దం చెడు ఆత్మలు, ప్రతికూల శక్తులను దూరం చేస్తాయని భావిస్తారు.
ప్రార్థనలో సహాయం: పూజలో శంఖం ఊదడం ద్వారా దైవిక శక్తి ఆహ్వానించబడుతుంది. విష్ణుపూజలో ఇది ముఖ్యమైనది.
సాంస్కృతిక గుర్తు: శంఖం ధ్వని వినిపించడం మానవులను ఆహ్వానించడం, శుభారంభ సూచన, లేదా యుద్ధం ప్రారంభించడాన్ని సూచించేది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.
*పాటించవలసిన ముఖ్య నియమాలు*
పూజగదిలో పూజించడానికి ఒక శంఖం, ఊదడానికి మరొక శంఖం వేర్వేరుగా ఉంచాలి. పూజించే శంఖాన్ని ఎప్పుడూ ఊదకూడదు.
శివుడి పూజలో సాధారణంగా శంఖనాదం చేయరు, అలాగే శివలింగానికి శంఖంతో జలాభిషేకం చేయకూడదు (శంఖచూడుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించిన కథ దీనికి కారణం).
భూమిపై పెట్టకూడదు: శంఖాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకూడదు పీఠం, గంధపు చెక్క లేదా శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి..
గమనిక ఇది కేవలం కొందరు ఆధ్యాత్మిక ద్వారా తెలుసుకున్న విషయం మాత్రమే.. ఇదే స్థాయిలో నిజమని ఇలానే ఆచరించమని ఏం తెలియజేయడం లేదు.. మీరు కూడా సలహాలు సూచనలు తీసుకొని పాటించగలరు..