ఈనెల 31న జల్స సిరతున్ నబీ సభ..!

ఈనెల 31న జల్స సిరతున్ నబీ సభ

దేవరకొండ…………..
దేవరకొండ ఈద్గా కమిటీ, మదర్సా మిస్బా ఉల్ ఉలుమ్, జమియాత్ ఉలేమా ఏ హింద్ దేవరకొండ శాఖ ల ఆధ్వర్యంలో ఈ నెల 31న శనివారం నాడు దేవరకొండ పట్టణం లోని స్థానిక ఆఖ్సా మస్జీద్ ( చిన్న దర్గా ) లో 36వ జల్స సీరతున్ నబీ సభ నిర్వహిస్తున్నట్లు ఈద్గా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ అజీమోద్దీన్, యండి ఇలియాస్ పటేల్ లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వారు మాట్లాడుతూ ఈ యొక్క సీరతున్ నబీ జల్సాలో పలు జంటలకు సామూహిక వివాహాలు జరుగుతాయని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది జల్సా లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మత పెద్దలు, గౌరవ నీయులు ఆరిఫ్ బిల్ల హాజ్రత్ మౌలానా షా జమాలుర్ రెహమాన్ సాహెబ్ విచ్చేస్తున్నారని.. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజ్రత్ మౌలనా సయ్యద్ షా ఎహెసానుద్దీన్ సాహెబ్ ఖాస్మి, గౌరవ అతిథులుగా హాజ్రత్ ముఫ్తి అబుబక్కర్ జబెర్ ఖాస్మి సాహెబ్, మరియు హాజ్రత్ ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ సహాబ్ ఖాస్మి దామత్ బరకాతహుమ్ లు విచ్చేస్తున్నారని తెలిపారు.
సిరతున్ నబీ సభ కు హాజరయ్యే ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ యొక్క జల్సాకు సహకరిస్తూ చేయూతనందిస్తున్న ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో గౌరవ అధ్యక్షులు ఎండి షబ్బీర్ అహ్మద్, ఉపాధ్యక్షులు ఎండి ఖదీర్ సాలార్, ఎండి షబ్బీర్, సభ్యులు యండి ఖుద్రతుల్లా, ఎండి సలీం ఎండి ఖాజమైనుద్దీన్, సయ్యద్ దస్తగీర్, జమీన్ అలీ, ఎండి ముజీబ్, ఎస్.కె బురాన్, ఎండి షకిల్, ఇల్యాస్ బాబా, సయ్యద్ అజీజ్, మహ్మద్ అఫ్రోజ్, జాఫర్ ఖాన్, ఎండి ఖలేఖ్, ఎండి ఖైసర్, మంజూర్, షఫీ ఉల్లా, ఎస్.కె అజ్మత్, జాకీర్, ఇస్మాయిల్, ఖాజా భారీ, నజీర్ తదితరులు పాల్గొన్నారు.