కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి,,..

: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ( Local Body Elections ) కూటమి పార్టీల నాయకులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పదవులపై ఆశలు పెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు పొత్తు కారణంగా మరో పార్టీకి ఆ స్థానం ఖరారు కావడం పట్ల అన్ని పార్టీల నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏపీలో టీడీపీ( TDP ), జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు గత సాధారణ ఎన్నికల నుంచి కొనసాగుతుంది.ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిష్పత్తి వారిగా సీట్లు కేటాయింపు అధిష్టాన నాయకుల మధ్య సజావుగా జరిగింది.అయితే ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్వతీపురం జిల్లాలోని సాలూరు మున్సిపల్‌ చైర్మన్‌ సీటును కనీసం 2 శాతం కూడా లేని జనసేనకు కేటాయించడంపై మంత్రి కంటనీరు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేటాయింపులు అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించాలని శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కోరారు.