లవ్ .. రొమాన్స్ నేపథ్యంలోని కథలలో, తనదైన మాస్ యాక్షన్ మార్క్ చూపిస్తూ విజయ్ దేవరకొండ ముందుకు వెళుతున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సారి చారిత్రక నేపథ్యంలో కథను ఎంచుకుని .. లుక్ మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలా ఆయన చేసిన సినిమానే ‘రణబాలి’. పెళ్లి తరువాత విజయ్ దేవరకొండ – రష్మిక కలిసి చేసిన సినిమా కావడంతో సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. గతంలో చారిత్రక నేపథ్యం కలిగిన ‘శ్యామ్ సింగరాయ్’తో నానీకి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్, ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి కూడా హిట్ కొట్టినట్లు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు..
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఈశ్వరి రావు, లాల్, వినోద్ సాగర్ తదితరులు
Ranabaali.
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ..
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
సంగీతం: అజయ్ అతుల్
నిర్మాతలు: రవిశంకర్, నవీన్ యేర్నేని
దర్శకుడు: రాహుల్ సంక్రీత్యన్..
బ్రిటీష్ వారి పాలనలో 1850-1870ల కాలం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మన దేశంలో పండిన ధాన్యాన్ని బలవంతంగా ఇంగ్లాండ్కు తరలించడం వల్ల స్థానికంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. తిండి లేక అల్లాడుతున్న తన ప్రజలను రక్షించుకోవడానికి, బ్రిటీష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) వేధింపులను ఎదిరించడానికి సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) ఎలా ముందుకొచ్చాడు..? అసలు భద్ర మల్లన్న దేవుడికి, రణబాలికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? తన ప్రాణాలను పణంగా పెట్టి వలసవాదుల ధాన్యపు ఎగుమతులను అతడు ఎలా అడ్డుకున్నాడు.. మధ్యలో జయమ్మ (రష్మిక మందన్న) తో రణబాలికి పెళ్లి ఎప్పుడు అవుతుంది..? ఆ తర్వాత పరిస్థితులు ఏంటి అనేది ఈ చిత్ర కథ..
రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడనిపిస్తోంది. . నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది.. అలా పూర్తి స్థాయిలో మెప్పించే చిత్రంగా మల్చడంతో రాహుల్ సంకృత్యాన్ వంద శాతం సక్సెస్ అయ్యారు అనే టాక్ వచ్చింది…
బ్రిటీష్ వారి అణచివేత.. ఒక యోధుడు తిరుగబాటు చేయడం.. చివరకు అంతమొందించడం అన్నది కథ. .
గతంలో మనం చూసిన చాలా దేశభక్తి సినిమాల ఛాయలు ఇక్కడ పదే పదే గుర్తుకొస్తాయి. అసలు కథను ముందుకు తీసుకెళ్లకుండా, ఒకే పాయింట్ చుట్టూ సన్నివేశాలు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్లో సైతం ఎమోషన్స్ బలంగా రాసుకున్నాడు.. .
కానీ డీటైలింగ్ వరకు మాత్రం రాహుల్ అదరగొట్టేసాడు. 1850ల నాటి పరిస్థితులు, అప్పటి జనం, బ్రిటీష్ వాళ్లు పెట్టిన కష్టాలు.. అదే సమయంలో వాళ్లకు ఎదురుతిరిగే ఓ పాలెగాడు.. ఇదే రణబాలి కథ. హైలైట్ ఉంది అని విజిల్ వేయించే సీన్స్ కంటే.. మంచి కథ చెప్పాలనేదాని పైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు..ఇంటర్వెల్కు ముందు ఓ ఫైట్ అదిరిపోతుంది. ఎమోషన్ విషయంలోనూ రాహుల్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు.. ఆకలి బాధలు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా..
విజయ్ దేవరకొండ పూర్తిగా ఒదిగిపోయాడు. అతని లుక్, కడప యాస పలికిన విధానం చాలా బాగున్నాయి. ముఖంలో రౌద్రం చూపిస్తూ తన పాత సినిమాల కంటే ఇందులో ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచాడు.
విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. క్రూరమైన బ్రిటీష్ అధికారిగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ తన స్క్రీన్ ప్రెజెన్స్తోనే భయపెట్టాడు. హీరో తల్లిగా ఈశ్వరీ రావు, కీలక పాత్రలో వినోద్ సాగర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే….
ఓవరాల్ గా సినిమా మాత్రం కొంత నెగిటివ్ టాక్. మరికొంత పాజిటివ్ టాక్ తో పరవాలేదు అనిపిస్తుంది అంటున్నారు ప్రేక్షకులు..