రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జీల నియామకం..
*తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.



తెలంగాణ భవన్లో ఈరోజు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం అనంతరం ఇన్చార్జీల పేర్లను ప్రకటించారు. సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను ఇన్చార్జీలకు అప్పగించారు.