హుజూర్నగర్, కోదాడ అభివృద్ధి పనులపై సమీక్ష చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆలస్యాలపై అధికారులను గట్టిగా హెచ్చరించిన మంత్రి
హైదరాబాద్,: హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం జలసౌధలో జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాగునీటి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమగ్ర సమీక్ష సందర్భంగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“పంట సీజన్ ముగిసిన నేపథ్యంలో, అధికారులు ఈ విరామ సమయంలో భు సేకరణ వేగవంతం చేయాలి,” అని తెలిపారు. యుద్ధప్రాతిపదికన పూర్తవ్వాలి మరియు సంబంధిత ఏజెన్సీలకు అందరు అందుబాటులో ఉండే దీన్ని అప్పగించాలి. పంప్ హౌజ్ నిర్మాణం పైపులైన్లు వేసే పనులు చురుగ్గా జరగాలని సూచించారు..
ప్రతి పనికి నిర్దిష్ట గడువును నిర్ణయించాలన్నారు. “విధుల పట్ల ఎటువంటి ఆలస్యం ఉంటే తీవ్ర చర్యలు తీసుకుంటాను. తరువాతి సమీక్షలో పురోగతి కనపడకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది,” అని మంత్రి అధికారులను గట్టిగా హెచ్చరించారు. “ప్రజా ప్రయోజనమే మన ప్రయోజనం” అని స్పష్టం చేశారు.
హుజూర్నగర్ మరియు కోదాడలోని ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగా, ముక్త్యాల బ్రాంచ్ కాలువకు సంబంధించి పూర్తై, పైపులైన్లు వేయడం జరుగుతోందని అధికారులు తెలిపారు. జనపాడు బ్రాంచ్ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై పైపులైన్లు వేయడం త్వరగా పూర్తి చేయాలని, ప్రధాన వర్క్ ను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా “జవాహర్ జనపాడు ఎల్ఐఎస్”గా పిలవాలని సూచించారు.
బెట్టేతండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నక్కగూడెం ఎల్ఐఎస్, రాజీవ్ గాంధీ ఎల్ఐఎస్, రెడ్లకుంట ఎల్ఐఎస్, ఉత్తమ్ పద్మావతి ఎల్ఐఎస్ తదితర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రతి పనికి తాత్కాలిక గడువులు సూచించి, ప్రస్తుత పరిస్థితి,, పూర్తి చేసే అంచనా తేదీలపై అధికారులను అడిగి తెలుసుకు న్నారు.
ప్రధానంగా పాత ప్రాజెక్టుల్లో ఆలైన్మెంట్ మార్పుల వంటి ఇబ్బందులు ఉన్నాయని అధికారులు తెలియజేశారు. వాటిని ముందే గుర్తించి సాంకేతిక, చట్టపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే సవరిస్తూ అంచనాలు పంపించాలని, పనులు చేయని కాంట్రాక్టర్ల ఒప్పందాలను సవరణ చేసుకుంటూ, పనులు పూర్తిగా కావాలని ఆదేశించారు.
ఒక్కో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. “ప్రతి శాఖ మధ్య సమర్థవంతమైన సమన్వయం అవసరం,” అని అన్నారు.
ఇరిగేషన్ కాకుండా ఇతర మౌలిక సదుపాయాల పనులపై కూడా సమీక్ష జరిగింది. కోదాడలో 100 పడకల ఆసుపత్రి, హుజూర్నగర్లో ఐటీఐ బిల్డింగ్, టౌన్ హాల్, మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నిర్మించాల్సిన వ్యవసాయ కళాశాల మరియు జవాహర్ నవోదయ విద్యాలయాల కోసం తగిన స్థలాలను గుర్తించాలన్నారు. వ్యవసాయ కళాశాల కోసం 100 ఎకరాలు, నవోదయ విద్యాలయం కోసం 25 ఎకరాలు అవసరమని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు ప్రతిష్టాత్మకమైనవిగా పేర్కొంటూ, ప్రభుత్వ భూమి, సాగునీటి శాఖ ఇతర అనుకూల భూములను వారం రోజుల్లో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతి రేషన్ కార్డుదారుడికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం అందజేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పథకం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని నాయకులను కోరారు. ఇది విప్లవాత్మకమైన పథకమని పేర్కొంటూ, రాష్ట్ర జనాభాలో సుమారు 84 శాతం అయిన 3 కోట్ల మందికి భద్రతా ఆహారాన్ని అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. అన్ని అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి పంట సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, ఎక్కువ ప్రాంతాలకు నీటిని అందించగలగాలనే లక్ష్యంతో అత్యవసరంగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.