ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే కొద్ది రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఇల్లు పూర్తయినా ఫైనల్ బిల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సోమవారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇప్పటివరకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున రూ.40 వేల కోట్లను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ మరో మూడు, నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నరాు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.