రష్మిక మందన్న మాస్ వార్నింగ్…!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ‘కాఫీ విత్ కరణ్ షో’కు హాజరయ్యారు…ఈ షోలో తనను పెళ్లి చేసుకోమని రష్మిక మందన్న, ఏడాది మొత్తం అడుగుతూ వచ్చిందని విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. అలాగే ఈ షోలో విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరు నచ్చకపోవడంతో రష్మిక మందన్న ఏడ్చేసిందంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. రష్మిక మందన్న ఎమోషనల్ కావడంతో దాదాపు గంటసేపు షూటింగ్ ఆపేశారని, ఆ తర్వాత తిరిగి షూట్ చేశారని కూడా సోషల్ మీడియాలో మీమ్స్ కనిపించాయి. ఈ వార్తలపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక మందన్న.

కావాలని పని గట్టుకుని ద్వేషం వెదజల్లుతున్నారు…

‘నా ప్రియమైన ఇంటర్నేట్‌ ప్రజలారా… మమ్మల్ని ఎంతో ప్రేమించే వారికి, ఎప్పటికీ ద్వేషించేవారికి… నా గురించి, విజ్జు గురించి ఒక్క చిన్న విషయం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. సాధారణంగా ఇలాంటి విషయాలను నేను అస్సలు పట్టించుకోను, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారివి. కొన్నిసార్లు ఇలాంటి వాటిని చదివి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అయితే మా తాజా ఇంటర్వ్యూలో వస్తున్న ట్రోలింగ్ చూస్తుంటే జనాలు కావాలని కోపంతో, ద్వేషంతో పని కట్టుకుని చేస్తున్నట్టుగా ఉంది.

ప్రేమను నమ్మే వ్యక్తులు, ఆ నమ్మకం కోల్పోకూడదనే ఉద్దేశంతో దీన్ని రాస్తున్నాను. మా ప్రొఫైల్స్‌లో కొంతమంది అనవసరమైన అభిప్రాయాలు, కామెంట్లు చేస్తూ, అడగకపోయిన సలహాలు ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మాపై ప్రజలు చూపించిన ఈ కేర్ చూసి నేను షాక్ అయ్యాను. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మా వ్యక్తిగత జీవితం గురించి మీరంతా ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థమైంది. అందుకే వివరణ ఇవ్వాలని అనుకుంటున్నా.

నేనే, పెళ్లి ప్రపోజల్ తెచ్చాను.. అయితే ఏంటి?.

మొదటి విషయం ఏంటంటే… నేను, విజయ్‌కు ప్రపోజ్ చేశాను. పెళ్లి ప్రపోజల్ తెచ్చాను. అయితే ఎన్ని సార్లు అడిగానో, ఎన్నో రోజులు అడిగాను అనేది అనవసరం. అక్కడ సంఖ్యలు, లెక్కలు ఎందుకు వస్తున్నాయి? జీవితంలో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత సమయం కావాలని అతను కోరుకున్నాడు. నేను, ఇదే సరైన సమయమని అనుకున్నాను. ఇద్దరికీ క్లారిటీ వచ్చాకే పెళ్లి చేసుకున్నాం.

మాకు ఏం కావాలో ఇద్దరికీ పూర్తి క్లారిటీ ఉంది. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అతను ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి. పెళ్లి అంటే మోకాళ్ల కూర్చోని ప్రపోజ్ చేయడం, వేలికి ఉంగరం తొడగడం గురించి కాదు. జీవితాన్ని కలిసి ఉండడం, జీవితాన్ని పంచుకోవడం, కలిసి భవిష్యత్తును నిర్మించుకోవడం. ఇప్పటివరకూ మా కాపురం అన్యోన్యంగానే సాగింది.