అర్నబ్ తుఫాన్‌తో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
..
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ,
తూ.గో..
యానాం, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు.
బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాలకు వరద హెచ్చరికలు.
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక…
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్..
మరింత బలపడిన అర్నబ్ తీవ్ర తుఫాన్.
గంటకు 25 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్.
విశాఖకు 300 కి.మీ, కాకినాడకు 560 కి.మీ..
బాపట్లకు 530 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం..
రేపు ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.
తీరం దాటే సమయంలో 115-125 కి.మీ. వేగంతో గాలులు.
అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ….
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ అతి తీవ్ర తుఫానుగా బలపడింది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. కోస్తా జిల్లాలతోపాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ సూచించారు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. అర్నబ్ తుఫాన్‌తో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూ.గోదావరి, యానాం, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు.. బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాలకు వరద హెచ్చరికలు చేశారు…తుఫాన్ కారణంగా కోస్తా, ఉత్తరాంధ్రలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. అనకాపల్లి జిలాల్లో 27,28,29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ఈనెల 30 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.