యూపీఐ అంటే ప్రతి రోజూ బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. ఒక్కసారిగా వంద గుడ్లు కావాలన్న ఆశతో దాన్ని చంపేస్తే చివరకు ఏమీ మిగలదు’…అన్నామలై.
యూపీఐ ఎండీఆర్ చార్జీల విధింపుపై తమిళనాడు నేత కే అన్నామలై విమర్శలు గుప్పించారు. ఈ చార్జీల నుంచి చిరు వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు..ఉడిపిలో ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. యూపీఐ వ్యవస్థ నుంచి ఆదాయం కంటే స్థానిక వ్యాపారుల జీవనోపాధిని కాపాడుకోవడమే ముఖ్యమని చెప్పారు. ‘యూపీఐ అంటే ప్రతి రోజూ బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. ఒక్కసారిగా వంద గుడ్లు కావాలన్న ఆశతో దాన్ని చంపేస్తే చివరకు ఏమీ మిగలదు’ అని అన్నామలై అన్నారు.
యూపీఐ వ్యవస్థ ఇప్పుడు రోజువారీ జీవితంలో ఓ భాగమైందని అన్నారు. ఈ దశలో చార్జీలు విధిస్తే మొత్తం వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. లావాదేవీలు ఉచితం కావడంతో యూపీఐ ఈ స్థాయిలో ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి మంచి పట్టు ఉన్న కోస్తా జిల్లాలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం..