మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
నాలుగు వారాల్లో చర్యల నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి, పోలీస్ కమిషనర్‌కు ఆదేశం
ఘటనపై స్వతంత్ర వైద్య నిపుణులతో విచారణ జరిపించాలని, ఐశ్వర్యకు సంబంధించిన పూర్తి వైద్య రికార్డులను భద్రపరిచి కుటుంబ సభ్యులకు అందజేయాలని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని, అదే ఆసుపత్రిలో ఇతర రోగుల మరణాలపై వచ్చిన వార్తలపై కూడా దర్యాప్తు జరిపించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన న్యాయవాది..
ఈ వివాదాస్పద మరణం మరియు వైద్యుల నిర్లక్ష్యంపై వస్తున్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన కమిషన్, తదుపరి చర్యల నిమిత్తం కీలక ఆదేశాలు జారీ చేసింది..