నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్‌.

Ap Cyclone Arnab Crop compensation

నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్‌…పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం..

వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం
చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ..

సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేల సాయం..

అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు..

కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం.

కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు.

తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం.

కొబ్బరి, ఆయిల్ పామ్‌ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు..

అర్నబ్ తుపాను బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం భారీ పరిహార ప్యాకేజీ..

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, ఇళ్ల నష్టానికి ఆర్థిక సాయం.

వ్యవసాయ, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ. 35,000 వరకు పరిహారం.

తుఫాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక, కేంద్ర బృందాన్ని కోరిన సీఎం.

ప్రతీ బాధితుడికి పారదర్శకంగా సాయం అందిస్తామని చంద్రబాబు హామీ.

అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని, నష్టపోయిన చివరి వ్యక్తికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తుపాను అనంతర సహాయక చర్యలు, నష్టపరిహారంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తుపాను బాధితుల కోసం ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది.

ఇళ్లు, పంటలు, పశువులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని, వీలైనంత వేగంగా పరిహారం అందించి వారిని తిరిగి నిలబెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ప్యాకేజీ పారదర్శకంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుందని సీఎం తెలిపారు. తక్షణ సహాయం కింద తుపాను ప్రభావిత కుటుంబాలకు నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

తక్షణ సహాయం మరియు ఇళ్ల నష్టపరిహారం
తుపాను కారణంగా ఇళ్లలోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం.
మత్స్యకారులు మరియు చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం.
ప్రతి కుటుంబానికి కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ చక్కెర, కేజీ బంగాళదుంపలు ఉచితంగా పంపిణీ.
తక్షణ ఖర్చుల కోసం ఒక్కో కుటుంబానికి రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 3000 వరకు ఆర్థిక సహాయం.
తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.
పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే రూ. 10,000 ఆర్థిక సహాయం.

వ్యాపారాలు, జీవనోపాధికి చేయూత
చిన్న కిరాణా షాపులు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులకు రూ. 25,000.
చేతివృత్తుల వారికి జీవనోపాధి నష్టానికి రూ. 25,000.
తోపుడు బండ్లకు రూ. 20,000.
ఎంఎస్ఎంఈ పరిశ్రమలు (రూ. 40 లక్షల టర్నోవర్ వరకు): రూ. 50,000.
పరిశ్రమలు (రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల టర్నోవర్): రూ. 1 లక్ష.
పరిశ్రమలు (రూ. 1.5 కోట్ల టర్నోవర్ పైబడినవి): రూ. 1,50,000.
దెబ్బతిన్న ద్విచక్ర వాహనానికి రూ. 3000
దెబ్బతిన్న ఆటోకు రూ. 10,000.

మత్స్యకారులకు నష్టపరిహారం
వలలు పాక్షికంగా దెబ్బతింటే మరమ్మతులకు రూ. 5000, రీప్లేస్‌మెంట్‌కు రూ. 10,000.
మెకనైజ్డ్ కాని బోటు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ. 20,000.
మెకనైజ్డ్ బోటు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ. 25,000.
చేపల చెరువుల పునరుద్ధరణకు రూ. 18,000.

పశు నష్టపరిహారం
ఆవు/గేదె మరణిస్తే: రూ. 50,000
దూడలకు: రూ. 25,000
గొర్రె/మేక: రూ. 7,500
కోడికి రూ. 100 (ఒక లబ్ధిదారునికి గరిష్ఠంగా రూ. 10,000).
పశువుల షెడ్ దెబ్బతింటే: రూ. 5,000.

వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టపరిహారం (హెక్టారుకు)
రూ. 75,000: తమలపాకు
రూ. 35,000: అరటి, పసుపు, యమ్, మిరప, జామ, బొప్పాయి, మామిడి, కాఫీ, యాపిల్ బేర్, సపోటా, కాజు, డ్రాగన్ ఫ్రూట్.
రూ. 25,000: పత్తి, వేరుశనగ, వరి, కూరగాయలు, టమాటో, పూలు, ఉల్లి, పుచ్చ, నర్సరీ, దానిమ్మ, కొత్తిమీర.
రూ. 25,000: చెరకు (మొదటి పంట)
రూ. 15,000: సజ్జ, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగి, కంది, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, జనుము, కొర్ర, సామ.
ఆయిల్ పామ్, కొబ్బరి: ఒక్కో చెట్టుకు రూ. 1500

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “నా మొదటి ప్రాధాన్యత ప్రాణనష్టాన్ని నివారించడం. అయినప్పటికీ ఐదుగురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని అన్నారు. మూడు రోజుల్లో ఎనిమిది సార్లు సమీక్షలు నిర్వహించి, టెక్నాలజీని వాడుకుని అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం వల్లే నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. తుపాను తీరం దాటిన అయిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించామన్నారు.

రెండు, మూడు రోజుల్లో కోనసీమ, పశ్చిమ గోదావరి మినహా అన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించి రవాణాకు అంతరాయం లేకుండా చేశామని, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.

తుపాను నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపి, కేంద్ర బృందాన్ని పంపమని కోరినట్లు తెలిపారు. రేపు, ఎల్లుండి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, బాధితులకు భరోసా కల్పిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజల కష్టాల్లో సర్వశక్తులు ఒడ్డి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.