బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువలేదుగా అని ప్రధాని ఎక్స్‌లో సెటైరికల్ పోస్టు…
ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా స్పందించారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ అక్రమంగా ఎన్నికల్లో గెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువలేదుగా అని ప్రధాని ఎక్స్‌లో సెటైరికల్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు ‘మోనోకిల్’ ఎమోజీని జతచేశారు…..కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. గతంలో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలు కూడా చేజారిపోయాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు సీటు దక్కకపోవడం గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈ ఫలితాలను ప్రస్తావిస్తూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు..
కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్నిస్థానాలు గెలుచుకుందో చూద్దాం. కర్ణాటక శాసన మండలిలో రెండు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ తరఫున ముగ్గురు బీజేపీ అభ్యర్థులు, ఒక జేడీ(ఎస్) అభ్యర్థి బరిలోకి దిగారు. బెంగళూరు ఉపాధ్యాయ స్థానంలో, జేడీ(ఎస్) అభ్యర్థి ఏపీ రంగనాథ్, ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన పుట్టన్నను ఓడించారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ ఓడిపోయి ఖాతా తెరవలేకపోయింది. అక్కడ ప్రతిపక్ష జేడీఎస్ (JD-S) అధికార కాంగ్రెస్ నుంచి ఒక స్థానాన్ని కైవసం చేసుకోగా, దాని మిత్రపక్షమైన బీజేపీ మూడు స్థానాలను నిలబెట్టుకుంది.
ఓటింగ్ యంత్రాల్లో అక్రమాలు .
జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ తరచూ ఆరోపణలు చేస్తున్నది. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే జరిగాయని మోదీ గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదంటూ పరోక్షంగా ఎద్దేవాచేశారు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యత
ఉత్తరప్రదేశ్‌లో 6 ఉపాధ్యాయ, 5 పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మొత్తం స్థానాల్లో బీజేపీ ఐదు శాసనమండలి స్థానాలను గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ (SP) మూడు స్థానాల్లో విజయం సాధించింది.
బిహార్‌లో ఖాతా తెరిచిన జన్ సురాజ్ పార్టీ
ఇక, బిహార్‌లోని 4 స్థానాల్లో ఫలితాలు సమానంగా ఉన్నాయి. బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు. కాగా, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్ పార్టీ’ అక్కడ ఒక స్థానాన్ని గెలుచుకుని తన ఎన్నికల ఖాతాను తెరిచింది.
మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో పుణే ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కౌస్తుభ్ గవాడే ఘన విజయం సాధించారు. మొత్తం 28 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి కౌస్తుభ్ గావడేకు 23,117 ఓట్లు సాధించాడు. ప్రత్యర్థి, మిత్రపక్షమైన శివసేన మద్దతు ఉన్న అభ్యర్థి సచిన్ సనాప్పై విజయం సాధించారు. సచిన్ సనాప్‌కు 16,347 ఓట్లు వచ్చాయి. ఈ పోటీలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయంత్ అసగావ్కర్ ఓటమి పాలయ్యారు..