సర్వీస్ కమిషన్ (TGPSC) మరో భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా కమిషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ పర్పస్ సోషల్ ఆర్గనైజర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) కేడర్లలోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన విద్యార్హతలు కలిగి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది..
బుధవారం నోటిఫికేషన్ (Notification No. 07/G/ES/2026) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు గడువు
అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 30 అక్టోబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ, సమయం: 27 నవంబర్ 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
పరీక్ష షెడ్యూల్ (టెంటేటివ్): జనవరి – 2027 లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్ టికెట్లు: రాత పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు
మొత్తం 102 ఖాళీలను రాష్ట్రంలోని ఏడు జోన్ల వారీగా విభజించారు.
జోన్-I: 12 పోస్టులు (UR-1, L-11)
జోన్-II: 14 పోస్టులు (UR-1, L-13)
జోన్-III: 15 పోస్టులు (UR-1, L-14)
జోన్-IV: 17 పోస్టులు (UR-1, L-16)
జోన్-V: 7 పోస్టులు (UR-1, L-6)
జోన్-VI: 25 పోస్టులు (UR-1, L-24)
జోన్-VII: 12 పోస్టులు (UR-1, L-11)..
దరఖాస్తు ప్రక్రియ ఎలా?.
అభ్యర్థులు ముందుగా కమిషన్ అధికారిక వెబ్సైట్ (https://www.tgpsc.gov.in) లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను సరిచూసుకోవాలి. ఒకవేళ కొత్తవారైతే పూర్తి బయోడేటాతో ఓటీఆర్ నమోదు చేసుకుని యూజర్ ఐడీ పొందాల్సి ఉంటుంది. అయితే కేవలం ఓటీఆర్ ఉన్నంత మాత్రాన దరఖాస్తు పూర్తయినట్లు కాదని, ఈ నోటిఫికేషన్‌కు విడిగా ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా అభ్యర్థులు గడువు కంటే ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాత పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBRT) లేదా ఆఫ్‌లైన్ ఓఎమ్మార్ (OMR) పద్ధతిలో నిర్వహిస్తారు. ఒకవేళ పరీక్షను వేర్వేరు సెషన్లలో నిర్వహిస్తే నార్మలైజేషన్ ప్రక్రియను అమలు చేసి మెరిట్ జాబితాను ప్రకటిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అర్హతలు, సిలబస్ సహా పూర్తి స్థాయి సమాచారం కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు..