మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుఫాన్ ఎఫెక్ట్..

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుఫాన్ ఎఫెక్ట్..

విజయవాడలో దంచికొడుతున్న వర్షం..

కౌంటింగ్ కేంద్రాలకు పూర్తిగా చేరుకోని సిబ్బంది..

ఇంకా ఆర్డర్‌ కాపీలు అందుకోని సిబ్బంది..

ఆర్డర్ కాపీల అనంతరం ప్రారంభంకానున్న కౌంటింగ్.

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బ్యాలెట్‌లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రీపోలింగ్‌ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్ స్టార్టయ్యింది. మధ్యాహ్నానికి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది…

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 116 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కౌంటింగ్ కోసం 248 హాళ్లు, 2805 టేబుళ్ల ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల లెక్కింపు మొదలైంది. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు, ప్రతి ఓటును ఏజెంట్లకు చూపించిన తర్వాత ఏర్పాటు చేసిన ట్రేలలో వేయనున్నారు సిబ్బంది. మురసు తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలు మినహాయించి మిగిలిన చోట్ల ప్రారంభమైంది. వర్షం కారణంగా రెండు జిల్లాల్లో కొంత ఆలస్యంగా లెక్కింపు ప్రారంభిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర వెల్లడించారు..

అధికార పార్టీ దూకుడు..

రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ లెక్కింపు ప్రక్రియ కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. నవంబర్ 1న జరిగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, పోలింగ్‌కు ముందే 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చైర్‌పర్సన్ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం… 13 కార్పొరేషన్లలో టీడీపీ 1 చోట ఆధిక్యంలో ఉంది. 21 మున్సిపాలిటీల్లో 17 చోట్ల కూటమి ఇప్పటికే గెలుపొందగా… 4 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.