కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్. సోనియా గాంధీతో భేటీ!.

బేటీ వెనక ఆంతర్యం ఏమిటో... అని ఆలోచన చేస్తున్నా బిజేపీ..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో శనివారం సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే తదితర నేతలు కూడా పాల్గొన్నారు.  కాగా ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. 
అయితే గాంధీ కుటుంబంతో ప్రశాంత్‌ కిషోర్‌ బేటీలో ఇటీవల జరిగిన అయిదు  రాష్ట్రాల ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు,  2024  సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. గుజ‌రాత్ పోల్స్‌పై చ‌ర్చించ‌డానికే ఈ భేటీ జ‌రిగిందని.. గుజ‌రాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నిక‌ల బ్లూప్రింట్‌పై కూడా చర్చించినట్టు కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి.