తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్…
_బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారింది.._
_దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.._
_ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది…_
_నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు…_
_సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రంగారెడ్డి సహా మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది…_
_రాగల 24 గంటల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది..